Tulasi Reddy Comments on CM Jagan : 'వైసీపీలో కేవలం కోటీశ్వరులకే చోటు.. జగన్ అత్యంత ధనిక సీఎం.. బ్లాక్ మనీ వెయ్యిరెట్లు' - ఏపీ ప్రధానవార్తలు
Tulasi reddy Comments on CM Jagan : వైసీపీలో కోటీశ్వరులకు తప్ప సామాన్యులకు చోటులేదని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్ ముఖ్యమంత్రి కాకముందే అప్పటికే దేశంలోని ముఖ్యమంత్రులందరిలో అత్యంత ధనవంతుడు అని అన్నారు. అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తి రూ.370 కోట్లు అని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు కోటీశ్వరులే ఉన్నారు.. ఇందులో నలుగురు బిలినీయర్లు అని వెల్లడించారు. అయోధ్యరామిరెడ్డి మొత్తం రాజ్యసభ సభ్యుల్లో అత్యంత ధనవంతుల్లో రెండోవాడు అని చెప్పారు. అయినా తనది పేదల పార్టీ అని జగన్ చెప్పటం విడ్డురంగా ఉందన్నారు. ఇసుకతో సహా ప్రకృతి వనరులన్నీ దోపిడికి గురవుతున్నాయి అని తులసిరెడ్డి విమర్శించారు. జగన్ పాలనలో మహిళా సాధికారత మసక బారిందని.. 'అమ్మ ఒడి'.. నాన్న బుడ్డికి చాలడం లేదని ఆరోపించారు. అమ్మహస్తం, బంగారు తల్లి పథకాలు రద్దు చేశాడు... డాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం 5 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు తగ్గించారని దుయ్యబట్టారు. తల్లికి, చిన్నమ్మ సౌభాగ్యమ్మ, చెల్లెళ్లు షర్మిలు, సునీతకు న్యాయం చేయని ముఖ్యమంత్రి.. మహిళా సాధికారితకు కృషి చేస్తాడని ఎలా నమ్మాలి..? అని తులసి రెడ్డి ప్రశ్నించారు.