Tirumala: తిరుమలలో మద్యం అక్రమ సరఫరా.. స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ - ఏపీ వార్తలు
Liquor Bottles In Tirumala: గత కొన్ని రోజులుగా తిరుమలలో అసాంఘీక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఘటనలు చోటు చేసుకోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంటుంది. తిరుమలలో మద్యం అమ్మకాలపై నిషేదం ఉన్నప్పటికి.. తరచూ మద్యం అక్రమంగా సరఫరా చేస్తూ పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు దొరికిపోవడం పరిపాటిగా మారిపోయింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మద్యం అక్రమ సరఫరా మాత్రం ఆగటం లేదు. ఈ నేపథ్యంలో తిరుమలలో మరో మారు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి అధికారులు పట్టుకున్నారు. తిరుమలలో అక్రమంగా మద్యం తరలించిన వ్యక్తిని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఐదు మద్యం సీసాలు లభ్యమయ్యాయి. స్థానికి హెచ్టీ కాంప్లెక్సు వద్ద ఓ దుకాణంలో మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐదు మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాన్ని టీటీడీ అధికారులు సీజ్ చేసి, ఆ వ్యక్తిని తిరుమల పోలీసులకు అప్పగించారు.