మహిళా భక్తురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీటీడీ ఉద్యోగి - Problems in Tirumala
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 9:15 AM IST
TTD Employee Angry with Devotees : తిరుమలలో తి.తి.దే. ఉద్యోగి ఓ మహిళా భక్తురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. బుధవారం శ్రీవాణి ట్రస్టు ద్వారా గర్భాలయంలోకి వెళ్లిన మహిళను ఉద్యోగి త్వరగా దర్శనం చేసుకోవాలని లాగాడు. అదేవిధంగా మరో మహిళను చేతి గాజులు పగిలేలా లాగాడని శ్రీవాణి ట్రస్టు దర్శనం ద్వారా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ చేతి గాజులు పగిలేలా లాగడమే కాకుండా తమని బెదిరించాడని హైదరాబాద్‌కు చెందిన దంపతులు మండిపడ్డారు.
శ్రీవాణి ట్రస్టుకు రూ.10,500 చొప్పున చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్తే గర్భాలయంంలోని సిబ్బంది ఇలా దురుసుగా ప్రవర్తించటం పద్ధతి కాదని భక్తులు తెలిపారు. దీనిపై తితిదే అధికారులు వెంటనే స్పందించి ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుందామని వస్తే మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించటం పద్దతి కాదని భాదితులు తెలిపారు. ప్రతి రోజు తిరుమల గూరించి వార్తలలోకి రావడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.