ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TTD_ Chairman_ Released_ Srivari_ Brahmotsavam_ Posters

ETV Bharat / videos

TTD Chairman Released Srivari Brahmotsavam Posters: తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు విడుదల - తిరుమల తిరుపతి దేవస్థానం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 10:12 PM IST

TTD Chairman Released Srivari Brahmotsavam Posters : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆలయం ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి  మీడియాతో  మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక మాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని.. సెప్టెంబరు  18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయన్నారు. అక్టోబర్ 14 నుంచి 22వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబరు 18వ తేదీన శ్రీవారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. 

బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేస్తామన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తామన్నారు. భక్తులకు వసతులు, భద్రతపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తమిళులు అత్యంత  ఇష్టంగా భావించే పెరటాసి మాసం బ్రహ్మోత్సవాల సమయంలో వస్తోందన్నారు. అశేష సంఖ్యలో భక్తుల రద్దీ రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details