TTD Chairman Bhumana Karunakar Reddy on Kalamkari Art: రాష్ట్ర కళగా 'కళంకారి'ని ప్రకటించేలా సీఎంను ఒప్పిస్తా: తితిదే ఛైర్మన్ భూమన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 7:20 PM IST
|Updated : Sep 4, 2023, 8:01 PM IST
TTD Chairman Bhumana Karunakar Reddy on Kalamkari Art: కళంకారిని రాష్ట్ర కళగా ప్రకటించేలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాను ఒప్పిస్తానని.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. సుమారు 30వేల సంవత్సరాల క్రితమే శిల్పకళ ప్రారంభమైందన్న ఆయన.. తితిదే శిల్పకళ, శుక్రకళ, చిత్రకళలను ఆదరిస్తుందన్నారు. పూర్వం కాలంనాటి కళలకు పునర్ వైభవాన్ని తీసుకురావడానికి తితిదే ఎంతోగానో కృషి చేస్తోందన్నారు.
Three Days Workshop Inaugurated By TTD Chairman:శిల్పకళపై మూడు రోజుల వర్క్‌షాపు ప్రారంభం.. తిరుపతి అలిపిరి రోడ్డులోని ఎస్వీ సంప్రదాయ శిల్ప శిక్షణా సంస్థలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న 'సంప్రదాయ ఆలయ శిల్పకళలు - అనుబంధ అంశాల' వర్క్‌షాప్‌ను తితిదే ఛైర్మెన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శనను ప్రారంభించి.. ఆలయ నిర్మాణ కళ, శిలా, సిమెంటు, కొయ్య, లోహ విగ్రహాలను, సంప్రదాయ చిత్రకళ, కళంకారి కళ ప్రదర్శనలను సందర్శించారు. శిల్పకళ 30వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని గుర్తు చేశారు. కళల్లో శిల్పకళకు గొప్ప స్థానం ఉందన్న భూమన.. తితిదే శిల్పకళలను ఆదరిస్తుందని.. ప్రాచీన కళలు మరింతగా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని వివరించారు.