తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు - అప్పటి వరకు వేచిచూడాల్సిందే! - tirumala temple
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 3:41 PM IST
TTD Announced Cancellation of Accrued Services: వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం నుంచి పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శన సదుపాయం కల్పించనున్నారు. ఉత్తర ద్వార దర్శనం పూర్తయ్యే వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
తిరుమలలో గందరగోళం:
తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. ఇవాళ సర్వదర్శనానికి భక్తులను టీటీడీ నిలిపివేసింది. 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయన్న తితిదే అధికారులు టికెట్లు లేని భక్తులను క్యూలైన్లలోకి అనుమతించలేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులకు వాగ్వాదం చోటుచేసుకుంది. రేపటి దర్శన టికెట్లు కలిగిన వారికి సాయంత్రం క్యూ లైన్లలోకి టీటీడీ అనుమతినిచ్చింది.
Tirumala Vaikuntha Dwara Sarvadarshan Tickets Distribution: తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజుల పాటు వైకుంఠ ద్వారప్రవేశానికి టీడీపీ చర్యలు చేపట్టింది. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార సర్వ దర్శనం టికెట్ల పంపిణీ దేవస్థానం ప్రకటించిన సమయం కంటే ముందే ప్రారంభమైంది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
TAGGED:
TTD latest news