ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నడిరోడ్డుపై ఆటో దగ్ధం.. క్షణాల్లో బూడిద.. తప్పిన ప్రాణ నష్టం

ETV Bharat / videos

Auto burnt: నడిరోడ్డుపై ఆటో దగ్ధం.. క్షణాల్లో బూడిద.. తప్పిన ప్రాణ నష్టం - AP Latest News

By

Published : Jun 4, 2023, 9:24 PM IST

Auto burning on the road: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వెంకటరాజుపురంలో ట్రక్కు ఆటో గృహోపకరణాలతో వెళ్తుండగా.. నడిరోడ్డుపై దగ్ధమైంది. ఆటో ఇంజన్​ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో ఆటో యజమానితో పాటు ఆయన కుమారుడు బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలానికి చెందిన నాయిని దుర్గాప్రసాద్, ఆయన కుమారుడు త్రినాథ్ వాయిదాల పద్ధతిలో గృహోపకరణాలు ఆటోలో తిప్పుతూ గ్రామాల్లో విక్రయిస్తారు. ఈ క్రమంలో చీడికాడ మండలం నుంచి దేవరాపల్లి వెళ్తుండగా.. వెంకటరాజుపురం వద్ద ఆటో ఇంజన్​లో నుంచి అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో కళ్ల ముందే క్షణాల్లో కాలి బూడిదైపోయింది. ఈ ప్రమాదంలో మూడు లక్షల విలువైన ట్రక్కు ఆటో, మరో రెండు లక్షల విలువైన గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. చుట్టు పక్కల ఉన్న గ్రామస్థులు మంటలను అదుపు చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details