సాగు హక్కు కల్పించాలని అనకాపల్లి గిరిజనుల ఆందోళన - anakapalli tribal news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 1:45 PM IST
Tribals Protest to Register Revenue Web Land :రెవెన్యూ వెబ్ ల్యాండ్ నమోదు చేసి సాగు హక్కు కల్పించాలని అనకాపల్లి గిరిజనులు డిమాాాాండ్ చేస్తున్నారు. వి.మాడుగుల, రావికమతం మండలాల సరిహద్దుల్లో ఉరలలోవ రెవెన్యూలో గిరిజనులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేశారు. జీడిమామిడిని సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాదారుల హక్కు కల్పించి, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమీపంలోని గ్రానైట్ కంపెనీ నుంచి తమకు విముక్తి కలిగించాలని పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పట్టాదారులకు ఆయకట్టు కట్టించాలని తెలిపారు.
Tribal Protest Anakapalli District : గిరిజనులు, ఆదివాసీలు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా ఇప్పటివరకు రెవెన్యూ వెబ్ ల్యాండ్లో నమోదు చేయలేదని ఆరోపించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందటం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. సంబంధిత అధికారులు సాగు హక్కు వెంటనే కల్పించాలని లేకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.