వైద్యులు లేని ప్రభుత్వాస్పత్రి - సంతకం చేసి వెళ్తున్నారని గిరిజనుల ఆందోళన - టీడీపీ ఇంచార్జి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 2:51 PM IST
Tribals Concern That No Doctors In Government Hospital:ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల గిరిజన గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఉండటం లేదని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామం మండల కేంద్రానికి దూరంగా ఉంటుందని, రాత్రి వేళల్లో ఏమైనా జరిగితే తమ పరిస్థితి ఏంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆ గ్రామానికి వచ్చిన టీడీపీ ఇంఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వద్ద వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేవలం సంతకాలు చేసి వెళ్లిపోతున్నారే తప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులే ఉండటం లేదని ఎరిక్షన్ బాబు మండిపడ్డారు.
TDP In-charge Complained In District Collector: తామంతా ఉండేది అటవీ ప్రాంతం కాబట్టి సమయానికి వైద్యం చేయటానికి ఆసుపత్రిలో వైద్యులు లేకపోతే ఎలా అని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గిరిజనుల సమస్యలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. స్థానిక సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని ఎరిక్షన్ బాబు హామీ ఇచ్చారు.