ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tribals_Carried_Pregnant_Woman_for_Three_Kilometers_on_Doli

ETV Bharat / videos

గిరిజన ప్రాంతాల్లో ఆగని డోలీ మోతలు- నిండు గర్భిణిని 3కిలోమీటర్లు మోసుకెళ్లిన స్థానికులు - గిరిజనుల అవస్థలు న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 1:37 PM IST

Updated : Dec 10, 2023, 1:45 PM IST

Tribals Carried Pregnant Woman for Three Kilometers on Doli: తరాలు మారినా గిరిజనుల తలరాతలు మారటంలేదు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులులేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలతో అత్యవసర పరిస్థితిల్లో హాస్పిటల్​కు వెళ్లేందుకు అంబులెన్సు వచ్చేందుకు కూడా రహదారులు లేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గర్భిణిలకు పురిటి నొప్పులు వచ్చిన సమయంలో గిరిజనులు నానావస్థలు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

Tribals Facing Problems with No Roads: పెదబయలు మండలం ఇంజరి పంచాయతిలోని మూలలోవలో పార్వతమ్మ అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా అంబులెన్సుకు కాల్ చేశారు. అయితే రహదారులు సరిగా లేకపోవటంతో అంబులెన్సు కొంతదూరంలో ఆగిపోయింది. దీంతో నిండు గర్భిణిని డోలీ మోతగా 3కిలోమీటర్లు మేర అంబులెన్సు వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి పాడేరు ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించటంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ ప్రాంతంలో రహదారుల వసతి కల్పించాలని కోరుతున్నారు. 

Last Updated : Dec 10, 2023, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details