MLA's Promise Should Be Fulfilled: గుర్రం మీద వచ్చిన ఎమ్మెల్యే గారు.. ఇచ్చిన మాట తప్పారు! - ఎమ్మెల్యే ధర్మశ్రీ
MLA's Promise Should Be Fulfilled గుర్రంపై వచ్చి.. రహదారి కష్టాలు తీరుస్తామంటూ ఎమ్మెల్యే ఇచ్చిన హామీపై అతీగతి లేదంటూ.. అనకాపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు వాపోతున్నారు. ఆరు నెలల క్రితం గడపగడపకు మన కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చిన ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ .. రహాదారి ఏర్పాటుపై ఒక్క అడుగు ముందుకు పడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో కనీస మౌళిక వసతులైన విద్యుత్, వైద్యం, తాగునీరు, రోడ్డు రవాణా వంటి సమస్యలను ఎలాగో పట్టించుకోని ప్రభుత్వం.. కనీసం తమ పిల్లలకు విద్యను అందించే ఏర్పాట్లైనా చేయాలని కోరుతున్నారు. జిల్లాలో తాము నివసిస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం తమ పిల్లలు కి.మీ దూరం వెళ్లాల్సి వస్తోందని, రహాదారి లేని ప్రాంతం కావడంతో.. అంత దూరం పిల్లలను పంపలేక చదవు ఆపుకోవల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రధానంగా జిల్లాలో రావికమతం మండలంలోని నేరేడు బంధ, జోగంపేట గ్రామాల్లో అలాగే రోలుగుంట మండలంలో పితూరుగడ్డ తదితర గ్రామాల్లో బడి ఈడు పిల్లలు అధికంగా ఉన్నప్పటికీ సమీపంలో పాఠశాలలు లేక రోజు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.