Tribal Youth Blocked Anantha Babu Convoy at Kutravada Highway: ఎమ్మెల్సీ అనంతబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న గిరిజన యువత - Tribal Youth Agitation on Kutravada Road
Tribal Youth Blocked Anantha Babu Convoy at Kutravada Highway: అల్లూరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు కాన్వాయ్‌ను గిరిజన యువత అడ్డుకున్నారు. అనంతబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అనంతబాబు అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం కుట్రవాడ రోడ్డుపై.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి వాహనశ్రేణిని గిరిజన యువత అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులతో కలిసి వాహనాలను అడ్డగించారు. ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ అనంతబాబు అంటూ నల్ల బెలూన్లను ఎగురవేశారు. డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సత్తిబాబుకు చెందిన జామాయిల్ తోటను నరికివేసి.. ఆయన కుటుంబానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. సత్తిబాబు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా.. కొద్దిసేపు రోడ్డుపై నుంచి కదలకుండా నిరసన కొనసాగించారు. ఆ తర్వాత వారిని పక్కకు తప్పించి ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి వాహనాలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.