Police arrested మన్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పర్యటనను అడ్డుకున్న గిరిజన ఆదివాసీ నేతల అరెస్టు - MLC and MLA
Police arrested : రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు ఆదివారం రాజవొమ్మంగి మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు గిరిజన, ఆదివాసీ నాయకులను అరెస్టు చేశారు. గిరిజన సంఘం నాయకులు మండల కార్యదర్శి, కొండ్ల సూరిబాబు, ఆదివాసీ నాయకులు తాము సూరిబాబు, వంతు బాలకృష్ణ, పి.సత్యనారాయణ, జర్తా రాజు తదితరులను ఎక్కడకక్కడ అరెస్టులు చేసి రాజువొమ్మంగి జడ్డంగి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ని ప్రశ్నించేందుకు వారు యత్నించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు ఒట్టిగడ్డ గ్రామ శివారులో ఎమ్మెల్సీ అనంత బాబు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. బోయ వాల్మీకీలను ఎస్టీ జాబిలో జాబితాలో చేర్చే విషయంలో ఎమ్మెల్యే వైఖరి తెలపాలంటూ పట్టుబట్టారు, పోలీసులు లోతా రామారావును బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీస్ జీప్ ఎక్కించి జడ్డంగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.