Transgenders Protest for CBN: వైసీపీ అక్రమాల నిలయంగా మారిందన్న ట్రాన్స్జెండర్లు.. చంద్రబాబుకు మద్దతు - tdp hunger strike in ongole
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 6:18 PM IST
|Updated : Sep 29, 2023, 6:34 PM IST
Transgenders Protest for CBN: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ట్రాన్స్ జెండర్లు నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో.. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకి సంఘీభావంగా ట్రాన్స్ జెండర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చి.. ఆదుకున్నారని ట్రాన్స్ జెండర్స్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పరిపాలనలో తమకు ఎంతో అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. వైసీపీ సర్కార్ అక్రమాలకు నిలయంగా మారిందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకు కోసం తీసుకువచ్చిన పథకాల వల్ల తాము నేటికి లబ్ధి పొందుతున్నామని ట్రాన్స్ జెండర్ దుర్గ తెలిపారు. రాష్ట్రంలో ఎవరైనా ప్రజ సమస్యల గురించి మాట్లాడితే వారిపై వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వారిని వేధిస్తున్నారని దుర్గ ఆరోపించారు.