ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Transgenders Celebrations In Vizag

ETV Bharat / videos

Transgenders Celebrations: విశాఖలో ఘనంగా ముర్గిమాత జల్సా సంబరాలు.. భారీగా హజరైన ట్రాన్స్​జెండర్స్ - vizag latest news

By

Published : Jul 29, 2023, 1:49 PM IST

Updated : Jul 29, 2023, 2:07 PM IST

Transgenders Celebrations In Vizag: విశాఖలో శుక్రవారం ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలిచెట్టమ్మ పరివారి ముర్గిమాత జల్సా సంబరాలు ఘనంగా జరిగాయి. ముర్గిమాత సంబరాలను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటామని ఈ కార్యక్రమ నిర్వాహకులు అన్నారు. ఈ సంవత్సరం జులై 27 నుంచి 3రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విశాఖపట్టణం రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస కల్యాణ మండపంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాకులు తెలియజేశారు. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి రెండు వేల మందికి పైగా హిజ్రాలు వచ్చినట్లు ట్రాన్స్ జెండర్స్ విశాఖ అధ్యక్షుడు యల్లాజీ నాయక్​ పేర్కొన్నారు. ట్రాన్స్​ జెండర్స్​ కోసం తను చాలా సంవత్సరాల నుంచి ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు యల్లాజీ తెలిపారు.  ఈ వేడుకలు నిర్వహించేందుకు తమకు సహకరించిన పోలీసు శాఖకు యల్లాజీ నాయక్​ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించామని యల్లాజీ అన్నారు. వేడుకల్లో భాగంగా పలు సినీ గీతాలకు ట్రాన్స్​ జెండర్లు ఉత్సహంగా నృత్యాలు చేశారు.

Last Updated : Jul 29, 2023, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details