Adoni ASP పట్టుబట్టారు.. అరగంటలో ఐపీఎస్ బదిలీ.. చర్చాంశనీయంగా ఆదోని ఏఎస్పీ వ్యవహారం - ఐపీఎస్ అధిరాజ్ సింగ్ రాణా
Adoni ASP Transfer: కర్నూలు జిల్లాలో బాధ్యతలు చేపట్టిన అరగంటలోపే ఐపీఎస్ అధికారి .. మరోచోటికి బదిలీ కావడం జిల్లాలో చర్చాంశనీయమైంది. ఆదోని ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే అధిరాజ్ సింగ్ రాణా వెనుదిరగడం సంచలనంగా మారింది. తమ ప్రాంతానికి ఐపీఎస్ అధికారొస్తే తమ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలే.. సదరు అధికారిని ఊరు దాటించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఆదోని డెవలప్‌మెంట్ అథారటి(ఆడ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్డీవో స్థాయి అధికారి నుంచి సబ్ కలెక్టర్ స్థాయి అధికారిగా స్థాయిపెంచారు. సబ్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌ను నియమించారు. ఆదోని డీఎస్పీ కార్యాలయానికి ఏఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల జీవో విడుదల చేసింది.
ఐపీఎస్‌గా అధికారి అధిరాజ్ సింగ్ రాణాను ఏఎస్పీ నియమించారు. ఈ నెల 2వ తేదీన ఆయన ఆదోని ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపడుతూ సంతకాలూ చేశారు. అంతలోనే వెనుదిరగడం గమనార్హం. రాణా రానున్నారని తెలిసి స్థానిక అధికారుల్లో ఆందోళన మొదలైంది సమాచారం .ఇటీవల అందరు కలిసి అధికార పార్టీ స్థానిక ప్రతినిధి వద్దకు వెళ్లి మోర పెట్టుకున్నట్లు తెలిసింది .దాంతో ఆ ప్రజాప్రతినిధి ఆలోచన పడినట్లు సమాచారం. ఆయన విజయవాడ వెళ్లి ఆదోని నుంచి బదిలీ చేయించారని తెలిసింది.పాత డీఎస్పీ వినోద్ కుమార్ బదిలీ అయిన....ఇంకా ఆయన అదోనిలోనే కొనసాగుతున్నారు.