Trains Cancelled: రైలు ప్రమాద ఘటన.. విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లు రద్దు - రైళ్లు రద్దు
Trains Cancelled: ఒడిశాలో భారీ రైలు ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అత్యవసర విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం.. హైల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. హావ్‌డా వెళ్లే రైళ్లన్నింటిని దారి మళ్లించి పంపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద బాధితుల్లో తెలుగువారు ఎవరైనా ఉన్నారా.. అనే ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గురైన రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక మార్గాల్లో వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడి వారు అధిక శాతం మంది పయనిస్తారు. మరోవైపు.. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దవడంతో.. ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాదం దృష్ట్యా పలు రైళ్లు రద్దు చేశారు, మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఇప్పటి వరకూ ఈస్ట్ కోస్ట్ పరిధిలో 9 రైళ్లను రద్దు చేయడంతో పాటు.. మరో 11 రైళ్లను దారి మళ్లించారు. విజయనగరం మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను రద్దు చేశారు. విజయనగరం రైల్వే స్టేషన్‌లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ఓబిలేశు అందిస్తారు.