Train Stopped in Guduru: రైలులో ఏసీ, నీటి సమస్య.. చైన్ లాగి ప్రయాణికుల ఆందోళన - baroni
Train Stopped in Guduru: తిరుపతి జిల్లా గూడూరులో బరోని టూ కోయంబత్తూర్ వెళ్లే.. ట్రైన్‌ను ప్రయాణికులు నిలిపివేశారు. విజయవాడ స్టేషన్ నుంచి రైలు బోగిలో నీరు రావటం లేదని.. గూడూరు వద్ద ప్రయాణికులు చైను లాగి రైలును నిలిపివేశారు. బోగిల్లో ఏసీ పని చేయటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో రైలును నిలిపివేసేందుకు యత్నించినా సమస్య పరిష్కరిస్తామని చెప్పి పట్టించుకోకపోవడంతో గూడూరులో స్టాప్ లేకపోయిన చైన్ లాగి రైలును నిలిపివేశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయటంతో.. ట్రైన్ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది.
"విజయవాడలో రైలు ఎక్కినప్పటి నుంచి ఏసీ పనిచేయక పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. వాష్‌రూమ్‌లో కూడా వాటర్ లేకపోవడం వల్ల లేడీస్ ఇబ్బందులు పడ్డారు. నెల్లూరులో ఆపితే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అయినా ఏం పట్టించుకోలేదు. దీంతో గూడూరులో స్టాప్ లేకపోయిన ట్రైన్ ఆపాము. ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కారం చేయాలి"-ప్రయాణికుడు