ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళ మృతి

ETV Bharat / videos

కేదార్​నాథ్​లో యాత్రలో విషాదం.. ప్రాణాలు కోల్పోయిన బాపట్ల జిల్లావాసి - కేదార్​నాథ్

By

Published : Jun 2, 2023, 11:00 PM IST

Woman Died in Kedarnath: బాపట్ల జిల్లాకు చెందిన ఓ మహిళ కేదార్​నాథ్​లో ప్రాణాలు కోల్పోయింది. యాత్ర కోసమని బయల్దేరిన ఆమె తిరిగి వస్తుండగా.. మంచులో ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాపట్ల మండలం హైదర్​పేట గ్రామానికి చెందిన పెరుమాళ్ల లక్ష్మితో పాటు సుమారు 50 మంది యాత్రికులు కేదార్​నాథ్​, బద్రినాథ్​, కాశీకి విహార యాత్ర కోసమని బయల్దేరారు. వీరిలో కొందరు బాపట్ల జిల్లాకు చెందినవారు కాగా,  మరికొందరు ఒంగోలు, గుంటూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.  వీరంతా మే 15 వ తేదీన యాత్రలకు బయల్దేరారు. వీరిలో పెరుమాళ్ల లక్ష్మి కేదార్​నాథ్​లో దర్శనం చేసుకుని డోలిలో తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ మంచుతో కూడిన భారీ వర్షం కురిసిందని తెలిపారు. ఈ క్రమంలో మంచు వర్షం కారణంగా.. ఆక్సిజన్​ అందక డోలిలోనే ప్రాణాలు కోల్పోయిందని.. ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు వివరించారు. పెరుమళ్ల లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఆమెతో పాటు యాత్రలో ఉండటంతో..  వారి స్వగ్రామానికి తీసుకురావటానికి సమయం అధికం ఆవుతుందని, ఆమె కుమార్తె అక్కడే అంత్యక్రియలు జరిపారు. ఆమె అస్థికలు తరువాత కాశీలో కలుపుతామని కుటుంబ సభ్యులు వెల్లడించారు

ABOUT THE AUTHOR

...view details