ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Traffic problems due to CM YS Jagan Mohan Reddy visit

ETV Bharat / videos

సీఎం పర్యటనతో సామాన్యులకు ట్రాఫిక్ కష్టాలు - మీసం మెలేస్తూ హెచ్చరించిన కానిస్టేబుల్ - మైదుకూరులో సీఎం పర్యటణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 5:16 PM IST

Traffic problems due to CM YS Jagan Mohan Reddy visit: సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా, మైదుకూరులో నిర్వహించే వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, సీఎం మధ్యాహ్నం 12 గంటలకు పాల్గొనే కార్యక్రమానికి ఉదయం నుంచే ఆంక్షలు ప్రారంభమయ్యాయి. పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలతో, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడంది. 12 గంటలకు వచ్చే కార్యక్రమం కోసం ఉదయం 10:30 నుంచే ఆంక్షలు ప్రారంభించారు. పట్టణంలోని బద్వేల్ రోడ్డు నుంచి రాకపోకలు నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు సైతం అనుమతించలేదు. దీంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సీఎం రాకకోసం దాదాపు మూడు కిలోమీటర్ల దూరం మేరకూ ట్రాఫిక్ ఆంక్షలను పెట్టడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వివాహ వేడుకలకు పిలుపు అందుకున్న వారు సైతం ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్​ను నియంత్రించే సందర్భంగా పోలీసులు విలేకరులపట్ల దురుసుగా ప్రవర్తించారు. తాము సీఎం కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ఓ విలేకరిపై కానిస్టేబుల్ దర్భాషలాడాడు. మీసం తిప్పుతూ సవాల్ విసిరాడు. తోటి పోలీసులు వారించిన వినిపించుకోకుండా గొడవకు దిగడంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details