ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Traffic_Jam_at_Bheemili_Narsipatnam_Road

ETV Bharat / videos

నెలలు తరబడి కల్వర్టు నిర్మాణ పనులు - వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు - విశాఖలో ట్రాఫిక్ జామ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 12:34 PM IST

Traffic Jam at Bheemili Narsipatnam Road :రాష్ట్ర రహదారిగా ఉన్న భీమిలి - నర్సీపట్నం రోడ్డులో చోడవరం మాడుగుల మధ్య వాహనదారుల రాకపోకలకు తీవ్ర సమస్యగా మారిపోయింది. చోడవరం మాడుగుల  మధ్య రహదారిలో కల్వర్టు నిర్మాణ పనులు (Culvert Construction Works) నెలలు తరబడి సాగుతోంది. దీంతో నిత్యం వాహనాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి. అదే సమయంలో భారీ వాహనాలు బురదలో కూరుకుపోవడంతో అక్కడ ఇతర వాహనాల రాకపోకలకు కష్టంగా మారుతోందని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Culvert Construction Works on The Road Between Chodavaram Madugula :ప్రతి నిత్యం వాహనదారులు ఒకరితో ఒకరు గొడవ పడడం ఫలితంగా గందరగోళ పరిస్థితి ప్రతి రోజు తలెత్తుతోంది. సాయంత్రం సమయాల్లో, రాత్రి వేళల్లో కళాశాల నుంచి విద్యార్థులు తీసుకెళ్లే బస్సులకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసి తమ  సమస్యను  పరిష్కరించాలని వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details