Crop Fields Water Submerged In Movva: పొంగిపొర్లుతున్న కొండ వాగులు.. నీట మునిగిన పంట పొలాలు - ఏలూరు జిల్లాలో పొంగిపొర్లుతున్న కొండ వాగులు
Traffic Disruption In Eluru Dist: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిలుగుమిల్లి నుంచి కామయ్యపాలెం వెళ్లే రహదారిపై ఉన్న అశ్వరావుపేట వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా చుట్టు పక్కల సుమారు 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. జల్లేరు వాగుపై వంతెన నిర్మాణ పనులు చాలా క్రితమే నిలిపి వేశారు. దాని కారణంగా చుట్టుపక్కల గ్రామల ప్రజలు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని అధికారులను స్థానికులు కోరారు. అలాగే కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోనూ తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. మొవ్వతో పాటు పెదముత్తేవి, కోసూరు, చిన్నముత్తేవి గ్రామాలలో వరి నాట్లు నీట మునిగాయి. భీమనది, అయినంపూడి డ్రైనోల్లో గుర్రపుడెక్క, నాచు వంటి వాటిని సీజన్‌కు ముందు బాగు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే నీరు పంట పొలాల్లోకి వచ్చయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.