ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ETV Bharat / videos

Tourists Car Fell Into The Valley అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 15అడుగుల లోయలో పడిన కారు - కుమ్మరిపుట్టు డీమ్ గూడ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం

By

Published : May 21, 2023, 3:06 PM IST

Tourists Car Fell Into The Valley: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచింగిపుట్ మండలం కుమ్మరిపుట్టు, డీమ్ గూడ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్​కు చెందిన ఓ పర్యాటక కారు.. అదుపు తప్పి 15 అడుగుల లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. స్థానిక పంచాయతీ సర్పంచ్ పాండురంగ స్వామి.. స్థానిక ప్రజల సహాయంతో కారును లోయ నుంచి బయటకు తీశారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. ఘటనా సమయంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా.. కారులో ఉన్న ప్రయాణికులు.. ప్రముఖ పర్యాటక కేంద్రమైన డుడుమ జలపాతాన్ని చూసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణంలో తమ స్థానిక బంధువులను కలిసేందుకు వెళ్తుండగా కారు అదుపు తప్పి లోయలో పడినట్లు వారు చెప్పారు. ఈ ప్రమాదం నుంచి తమను రక్షించిన స్థానికులకు పర్యాటకులు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details