పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఘనంగా తొలేళ్ల పండుగ - ఏపీ న్యూస్
విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో తొలిఘట్టం తొలేళ్ల పండుగ ఘనంగా జరిగింది. ఘటాలు, చీరలతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, పూసపాటి వంశీయులైన పీవీజీ ఆనందగజపతిరాజు కుటుంబ సభ్యులు సుధాగజపతి, ఊర్మిళ గజపతి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలేళ్ల ఉత్సవంలో భాగంగా ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST