ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - తీవ్ర ఉత్కంఠ - ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పిటిషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 10:19 AM IST
Today Supreme Court Hearing on Chandrababu Bail Petition in Fibernet Case :ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. పైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అధినేత చంద్రబాబు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధబోస్ (Justice Aniruddha Bose), జస్టిస్ బేలా ఎం.త్రివేది (Justice Bela M. Trivedi)లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-A కేసులో తీర్పు నవంబర్ 7లోపు వెలువరిస్తామని సంకేతమిస్తూ ముందస్తు బెయిల్ కేసు విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.
TDP Chief Chandrababu Naidu Case Details :17-A కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం, ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచడం చేయొద్దని ధర్మాసనం మౌఖికంగా ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అందువల్ల ఇవాళ ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై నిర్ణయం వెలువరిస్తారా.. లేదంటే 17-A కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ప్రస్తుతమున్న ఆదేశాలను కొనసాగిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.