PRATHIDWANI సలహాదారులతో రాష్ట్రానికి ఒరుగుతున్నదేంటి - ఏపీ తాజా వార్తలు
సలహాదారులతో వాస్తవంలో రాష్ట్రానికి ఒరుగుతున్నదేంటి.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటి.. వారు ఐఏఎస్ అధికారుల కంటే గొప్ప సలహాలు ఇస్తారా. వారికి రూ. లక్షల్లో జీతభత్యాలు, మొత్తంగా కోట్లకొద్దీ వ్యయం.. ఒకవైపు పేదల సంక్షేమానికే కోతలు పెడుతున్న రాష్ట్రానికి.. నిజంగా ఇంత ఖరీదైన సలహాల అవసరం ఉందా.. ప్రభుత్వతీరుపై హైకోర్టు ఆగ్రహం ఇదే మొదటిసారి కాదు.. గతంలో సైతం కోర్టులు తప్పు పట్టినా ఎందుకని చీమకుట్టినట్టైనా లేదు.. ఈ సలహాదారుల సలహాలు ఏవరన్నా తీసుకుంటున్నారా.. విధేయతతో ఉంటారని కావాల్సిన వాళ్లకు పదవులు ఇవ్వటమేనా.. రోడ్లు వేయటానికి నిధులు లేవు కానీ సలహాదారులను.. పెంచుకుంటూ పోవటానికి డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి.. సలహాదారుల పేరుతో ఖర్చు రూ.కోట్లు ఎవరు చెల్లిస్తారు.. సలహాదారులను ఏ క్యాడర్ కింద నియమిస్తున్నారు.. ప్రజాధనం నుంచి ఏ విధంగా జీతభత్యాలు చెల్లిస్తున్నారు అనే అంశంపై ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST