Prathidwani: మరణించిన రైతు కుటుంబాలకు సహాయం అందేదెప్పుడు? - ఏపీ వార్తలు
సాగు భారమై, అప్పులు అధికమై, బ్యాంకు రుణాలు లభించక, వేధింపుల సుడిలో చిక్కిన రైతన్నలు ప్రాణాలు తీసుంటే... వారి మరణాలకు గుర్తింపు కూడా దక్కడం లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లో సగం మందికి కూడా పరిహారం అందని దుస్థితి. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. బాధిత రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 43... రైతు మరణాల నిర్ధారణ విషయంలో గుదిబండగా మారింది. ఈ నేపథ్యంలో అసలు రైతుల్ని ఆత్మహత్యల వైపు తోసేస్తున్న ప్రధాన కారణాలు ఏంటి? బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు సహాయం అందేది ఎప్పుడు? కౌలు రైతుల కష్టాలకు అంతం ఎప్పుడు? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST