ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

PRATHIDWANI : అమ్మఒడి పథకం అమలుకు ఇన్ని నిబంధనలు అవసరమా? - అమ్మఒడి పథకం పై నేటి ప్రతిధ్వని

By

Published : Jun 23, 2022, 9:08 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

అమ్మఒడి నగదు బదీలీ పథకంలో ప్రభుత్వం కోతలు విధించింది. లబ్దిదారులకు రూ.15వేలు పంపిణీ చేయాల్సిన చోట రూ.13 వేలే పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ నగదు పంపిణీ బాధ్యతను గతంలో పాఠశాలలో నిర్వహించేవి. ఇప్పుడు ఆ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు బదలాయించింది. ఈ పథకం అందుకోవాలంటే లబ్దిదారులు ఏడంచెల ధృవీకరణ ఉత్తీర్ణులు కావాలంటూ ప్రభుత్వం విధించిన నిబంధన లబ్దిదారుల తల్లిదండ్రును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే అమ్మఒడి పథకం వర్తిస్తుందన్న నిబంధనతో తల్లులు-పిల్లలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ పథకం అమలుకు ఇన్ని నిబంధనలు అవసరమా? ప్రభుత్వ అసలు లక్ష్యం ఏంటి? ఇన్ని ఆంక్షల మధ్య పేద పిల్లలు అమ్మఒడి ప్రయోజనాలు అందుకునేదెలా? ఇదీ నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details