PRATHIDWANI: రాజధాని భూములు లీజుకిచ్చే ప్రయత్నాలకు చట్టబద్ధత ఉంటుందా? - అమరావతి భూముల లీజు వ్యవహారంపై నేటి ప్రతిధ్వని
అప్పుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దృష్టి ఇప్పుడు అమరావతి భవనాలు, భూములపై పడింది. అక్కడ అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చి, ఆదాయం సమకూర్చుకునే దిశగా కదులుతోంది. మరోవైపు అమరావతి అభివృద్ధికి నిధుల కోసమంటూ... రాజధాని భూములను అమ్మేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా గతంలో ఇతర సంస్థలకు కేటాయించిన భూములను సైతం ఇప్పుడు అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు రాజధాని భూముల ధరలు, వాటి కేటాయింపుల విషయంలో కోర్టు తీర్పు సారాంశం ఏంటి? ఇప్పటికే నిర్మించిన భవనాలను లీజుకిచ్చే ప్రయత్నాలకు చట్టబద్ధత ఉంటుందా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST