SV University Students Protest ఎస్వీ యూనివర్సిటీ హాస్టల్ టిఫిన్లో జెర్రి.. విద్యార్థుల ధర్నా - వెంకటేశ్వర యూనివర్సిటీ ఫుడ్లో జర్రి
SV University Students Protest: తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో వడ్డించిన టిఫిన్లో జెర్రి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైల్లో ఖైదీల కంటే హీనంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వడ్డించిన టిఫిన్లో జెర్రి రావడంతో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం హాస్టల్ విద్యార్థులు నిరసన చేపట్టారు. తిరుపతిలోని ఎస్వీయూ వీసీ బంగ్లా ఎదుట బైఠాయించి విద్యార్థుల ధర్నా నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటలుగా వీసీ బంగ్లా వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో యూనివర్సిటీ ఎదురుగా రోడ్డుపై నిరసన తెలియజేశారు. ఆహారంలో జెర్రి పడిన ఘటనలో.. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి పోలీసులు చేరుకుని సర్ధిచెప్పడానికి ప్రయత్నించారు. అధికారుల వచ్చి సమాధానం చెప్పకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.