Tirumala Srivari Brahmotsavam : తిరు వీధుల్లో సింహ వాహనంపై విహరిస్తున్న శ్రీ మలయప్ప స్వామి - తిరుపతి న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 2:01 PM IST
Tirumala Srivari Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సప్తగిరుల్లో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోవ రోజు మలయప్ప స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. యోగ నరసింహ స్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా సింహ వాహనాన్ని అదిరోహించి.. తిరు వీధుల్లో విహరించారు.
యోగ నరసింహ స్వామి అవతారంలో తిరు వీధుల్లో ఊరేగుతూ.. భుక్తులకు కనువిందు చేశారు. సింహ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకోవటం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సింహ వాహనం పై ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకోవటం వల్ల బాధలు, భయాలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వాహన సేవ ముందు సాగిన కళా బృందాల ప్రదర్శనలు విశేషంగా భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవలో పాల్గొనేందుకు వేలాదిగా చేరుకున్న భక్తులతో మాడవీధుల్లోని గ్యాలరీలన్ని కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. బుధవారం రాత్రి ఏడు గంటలకు స్వామివారు ముత్యపు పందిరిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.