శ్రీవారు గజ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం - గజ వాహన సేవ
తిరుమలలో శ్రీవారి వాహన సేవలు నయనానందకరంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. జాజి పువ్వులు, పట్టు వస్త్రాలు, నీలిమణి, మాణిక్యాలతో అలంకార ప్రియుడైన మలయప్పస్వామి భక్తులను అభయ ప్రదానం చేశారు. భజన బృందాలు కోలాటాలతో తిరువీధుల్లో సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పారవశ్యంతో.. గోవింద నామం స్మరిస్తూ.. స్వామివారికి కర్పూర హారతులిచ్చి... నైవేద్యాలు సమర్పించారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST