వైభవంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై స్వామి విహారం - వైభవంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు
BRAHMOTSAVALU 2022 : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం సింహ వాహనంపై విహరించిన శ్రీవారు.. సాయంత్రం ముత్యపు పందిరి వాహనంలో విహరిస్తూ భక్తులకు అమితానందాన్ని కలిగించారు. పురవీధుల్లో విహరిస్తున్న స్వామి వారిని చూడడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి మాఢవీధుల్లన్నీ గోవిందా అనే నామస్మరణతో మారుమోగాయి. శుక్రవారం కల్పవృక్ష, సర్వభూపాల వాహనంపై స్వామి వారు విహరిస్తూ భక్తులను తరింపజేయనున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST