Minor Girl Rape Case Update: మైనర్ బాలికపై అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్ - ap crime news
Three persons Arrest in Minor Girl Rape Case: కృష్ణా జిల్లా పామర్రు మండలంలో మైనర్ బాలిక మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలికపై అత్యాచారం చేసిన లోకేశ్, నరేంద్రలతో పాటు వారికి సహకరించిన రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే 8 బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన లోకేశ్ బైకుపై ఓ లాడ్జికి తీసుకెళ్లి, తను బంధువైన నరేంద్రతో కలిసి అత్యాచారం చేశారని డీఎస్పీ వెల్లడించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లాడ్జి యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. అత్యాచార అవమాన భారంతో బాలిక ఆత్మహత్య చేసుకుందా, లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని ఆయన వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. నిందితుల ముగ్గురిని రిమాండ్‌కు తరలించి రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలియచేశారు.