కన్నుల పండువగా.. ఒంటిమిట్ట కోదండరామస్వామి రథోత్సవం
Vontimitta Kodanda Rama chariot festival: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏడో రోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగాయి. నేటి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరిస్తున్నారు. అడుగడుగునా భక్తులు స్వామి, అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా రాష్ట్రంలోని నలువైపుల నుంచి భక్తులు తరలి వచ్చారు. రథోత్సవంలో పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ సంసృతికి కార్యక్రమాలలో పాల్లొన్నారు. చిన్నా, పెద్ద తెడా లేకుండా కోలాటాలు ఆడుతుండగా... భజన బృందాలు శ్రీ రామ నామ జపం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బుదులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఉదయం ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది.