Thousands of women support Chandrababu in Anantapur హిందూపురంలో నారీ భేరీ.. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా హిందూపురంలో పెద్దఎత్తున మహిళల నిరసన ర్యాలీ - చంద్రబాబు అరెస్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 5:19 PM IST
Thousands of women support Chandrababu in Anantapur చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని నిరసిస్తూ మేము సైతం బాబుతో అంటూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానం నుంచి ర్యాలీ ప్రారంభించి పట్టణంలోని ప్రధాన వీధులలో ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై బాబు, జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను మొదట పోలీసులు అడ్డుకున్నారు. మహిళల ర్యాలీలో పురుషులు పాల్గొనకూనకూడదంటూ ఆంక్షలు విధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత యథావిధిగా మహిళలు చేపట్టిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని.. మహిళల శాపానికి వైసీపీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. మేము సైతం బాబుతో ఉంటామంటూ నినదించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు కొనసాగింది.