Tataiahgunta Gangamma Jatara:మూడో రోజు సాగుతోన్న తాతయ్యగుంట గంగమ్మ జాతర..ఆకర్షణగా నిలిచిన తోటివేషం - తిరుపతి ప్రధాన వార్తలు
Tataiahgunta Gangamma Jatara Celebrations : తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతరలో మూడో రోజు భక్తులు తోటివేషం ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్లు, అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. అమ్మవారి జాతరలో తోటివేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బొగ్గు పొడిని ఒళ్ళంతా పూసుకుని.. తెల్లనామం సాది కనుబొమ్మలపైన చుక్కబొట్లు పెట్టుకుని... వేపాకు మండలను కట్టుకుని బూతులు తిడుతూ సంచరిస్తే గంగమ్మ పరవశించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు మధ్య తిరుపతి నగరపాలక సంస్ధ మేయర్ శిరీషా దంపతులు అమ్మవారి ఆలయానికి చెరుకున్నారు. మేయర్ శిరీషా దంపతులు అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.