నగలు అమ్ముతాం అంటారు 'కొట్టేస్తారు' - WomenTraders ShopTheft
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 2:03 PM IST
Theft in Gold Shop: రోజురోజుకు దొంగలు ఎక్కువై పోతున్నారు. విభిన్న ఆలోచనలతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో బంగారు దుకాణంలో చోరీ(Theft) ఘటనలు స్థానిక వ్యాపారులను హడలెత్తించాయి. జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో మహిళలు ఉన్న రెండు బంగారు దుకాణా (Gold Shops)ల్లో చోరీలు జరిగాయి. ప్రత్యేకంగా మహిళా వ్యాపారులు (Women Traders) ఉన్న దుకాణాల్లోనే చోరీలు జరగుతుండటంతో దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Anantapur Women Traders Shops Theft: ఇద్దరు వ్యక్తులు కలిసి బంగారు నగలు అమ్మడానికి వచ్చినట్టు నమ్మించి దొంగతనానికి పాల్పడుతున్నారు. వీరు రెండు వేరు వేరు దుకాణాల్లో ఆభరణాల (Ornaments)ను తస్కరిస్తుండగా సీసీ పుటేజీ (CC Footage)లో రికార్డు అయ్యాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన దుకాణదారులు పోలీసులను ఆశ్రయించారు. యజమానుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అనంతపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు చోరీదారుల వివరాలు సేకరిస్తున్నారు.