Hyd Rains: అయ్యో పాపం.. నీటిలో కొట్టుకుపోయిన వాషింగ్ మిషన్ - నీటిలో కొట్టుకుపోయిన వాషింగ్ మిషన్
Rains in hyderabad: హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. యూసుఫ్‌గూడలో ఓ గల్లీలో రిపేర్ సెంటర్లోని వాషింగ్ మిషన్ నీటిలో కొట్టుకుపోయింది. దాన్ని ఆపేందుకు ఆ వ్యక్తి చాలా ప్రయత్నించాడు. వాటర్‌లో అది కొట్టుకుపోతుండగా.. పట్టుకునేందుకు శ్రమించినా.. ఫలితం దక్కలేదు. నీటి ప్రవాహం చాలా వేగంగా రావడంతో.. ఆ వాషింగ్ మిషన్ నీటిలో కొట్టుకుపోయింది. మరోవైపు పంజాగుట్టలో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. అందులో అంబులెన్స్ సైతం ఉంది. ఒక్కసారిగా భారీ వర్షంతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. వాహనదారులు, ప్రయాణికులు, నగరవాసులు అందరూ... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST