Cash Seized: పంచలింగాల చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు.. అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత - కర్నూలు జిల్లా లేటెస్ట్ న్యూస్
Huge Cash Seized: కర్నూలులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో లభ్యమైన రెండు కోట్ల యాభై లక్షల రూపాయల విలువైన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఘటనలో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. కర్నూలు పంచలింగాల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద నాలుగో పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సోదాలో ఎలాంటి ఆధారాలు లేకుండా రెండు కోట్ల యాభై లక్షల రూపాయల విలువైన నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారును కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా.. హైదరాబాద్కు చెందిన నిక్కమ్ నవనాథ్, అక్షయ్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులో ఈ భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
TAGGED:
Kurnool district latest news