'ప్రభుత్వ పనులు చేస్తుంటే అప్పుల పాలవుతున్నాం..' బిల్లుల కోసం రోడ్డెక్కిన గుత్తేదారులు
Contractors worry about pending bills : ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ గుత్తేదారులు రోడ్డెక్కారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ ఏడాదికి సంబంధించిన 5 వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉందని... వాటిని ఇవ్వాలంటూ విజయవాడ ఆర్అండ్బీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బిల్లుల బకాయికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ఎన్ని సార్లు విన్నవించినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ పనులు చేస్తే చెల్లింపులు త్వరగా వస్తాయనే ఆలోచనతో అప్పులు తెచ్చి మరీ పనులు చేయించామని గుత్తేదారులు తెలిపారు. పనులు పూర్తయ్యాక తీరా బిల్లులు చెల్లించక రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. లోపభూయిష్టంగా ఉన్న సీఎఫ్ఎంఎస్ ఫేజ్ -2 విధానంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. పెండింగ్ బిల్లులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకుంటే... మే 1 నుంచి పనులు నిలిపివేస్తామంటున్న గుత్తేదారులతో మా ప్రతినిధి ముఖాముఖి.