Councilors attacked each other in the municipal office అమలాపురం వైసీపీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు - Latest AP Political News in Telugu
Councilor chairperson members attack each other: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ కౌన్సిలర్లు కొందరు ఒకరినొకరు దాడి చేసుకున్నారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయ. వివరాల ప్రకారం తాము మున్సిపల్ కార్యాలయానికి వస్తే చైర్మన్ ఛాంబర్ ఎందుకు తెరవలేదని వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ సత్య నాగేంద్రమనిని ప్రశ్నించారు. ఆ సమయంలో చైర్మన్ భర్త సత్యనారాయణ కుమారుడు ప్రదీప్ కౌన్సిలర్ సుధారాణి భర్త చిన్నాతో వాగ్వాదానికి దిగారు. దీంతో ప్రదీప్ కర్రతో దాడికి దిగాడు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో సుధారాణి భర్త చిన్నా, గంగ భర్త శ్రీను, చైర్ పర్సన్ నాగేంద్రమని కుమారుడుకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన తో స్థానికంగా వైసీపీ వర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. సంఘటన అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఇంకొకరు పరస్పరం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసుకున్నారు. ఇలా ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం దాడికి పాల్పడటం వంటి సంఘటనలు మంత్రి విశ్వరూప్ వరకు చేరడంతో ఆయన ఆగ్రహం చెందదారు.