ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రుషికొండ

ETV Bharat / videos

Rushikonda constructions కొనసాగుతున్న విధ్వంసం.. రుషికొండపై యథేచ్ఛగా నిర్మాణాలు - రుషికొండ బీచ్

By

Published : Jul 16, 2023, 4:56 PM IST

Structures on Rushikonda in Visakhapatnam: విశాఖలో రుషికొండపై నిర్మాణాలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. సీఆర్​జడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఈ నిబంధనల ఉల్లంఘన అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని, కొండను తవ్వి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతూ భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని తెలిపారు. రుషికొండలో తొలిదశ నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిని నిలిపేయాలని తాజాగా ఉన్నత న్యాయస్దానంలో పిటిషనర్ మూర్తి యాదవ్ అఫిడవిట్ దాఖలు చేయడం, మరో వైపు విశ్రాంత ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ కేంద్రానికి ఇతర అధికారులకు లేఖలు రాయడం పనుల వేగాన్ని, నిబంధనల అతిక్రమణలను మరో సారి తెరపైకి తీసుకువచ్చాయి. ఇప్పటికీ ఇవి ఎందుకు నిర్మిస్తున్నారన్న అంశంలో ప్రభుత్వం సందేహాలను నివృత్తి చేయకపోవడం అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. అందమైన, ఆహ్లాదకరమైన పచ్చని కొండ రుషికొండను బొడి గుండు నుంచి కాంక్రీట్ జంగిల్ గా మారుస్తున్న వైనంలో తాజా స్థితి పై మా ప్రతినిధి అందిస్తున్న కథనం.

ABOUT THE AUTHOR

...view details