PRATHIDWANI: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని స్పష్టం చేసిన కేంద్రం - ఏపీ ముఖ్యవార్తలు
Amaravathi : అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమే అమరావతిని రాజధానిగా నిర్ణయించారని కేంద్ర మంత్రి రాజ్యసభలో గుర్తు చేశారు. అయినా రాజధానిగా అమరావతిని బలహీనపరిచే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. కోర్టులో కేసు ఉన్నా సరే.. స‌్వయంగా ముఖ్యమంత్రే రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలిస్తున్నట్లు దిల్లీలోనే ప్రకటించారు. మరోవైపు.. అధికార పార్టీ నేతలు కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క అమరావతి.. అనేక కుట్రలు అనే అంశంపై నేటి ప్రతిధ్వని.