Paravada Pharmacity: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దుర్భర పరిస్థితుల్లో తాడి ప్రజలు - పరవాడ ఫార్మాసిటీ నిర్మాణం
Thadi Village: ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ ఫార్మాసిటీ నిర్మాణం సమయంలో భూసేకరణలో తాడి గ్రామం నష్టపోయింది. మిగిలిన కొద్దిపాటి గ్రామం ఇప్పుడు రసాయన పరిశ్రమల కాలుష్య కోరల్లో మగ్గిపోతోంది. ఇక్కడి గాలి, నీరు కాలుష్యం.. సర్వం రసాయనాల మయం. గాలి, నీరు కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నామని తాడి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ గ్రామాన్ని సంపూర్ణంగా తరలించాలని తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి శాసన సభ్యుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కొంత మేర ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల రావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభోత్సవంలో కూడా వారం రోజులో తాడి గ్రామాన్ని ఖాళీ చేయించి వారికి మరింత నివాస యోగ్య అవకాశాన్ని ఇస్తానని ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికారు. ఏడాది కావస్తోంది ఇప్పటికీ అతి గతి లేదు. ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలోను , ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇదే హామీ గుప్పించారు. వారిని తరలిస్తామని హామీ ఇచ్చిన సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టకపోవడంతో తాడి గ్రామస్తులు అక్కడే రసాయన వ్యర్థాల మధ్య నానా అవస్థలు పడుతున్నారు.