మంత్రి ముందే బాహాబాహీకి దిగిన వైఎస్సార్సీపీ నేతలు - YSR Pension Kanukanews
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 10:12 PM IST
|Updated : Jan 4, 2024, 10:42 PM IST
Tensions in YSR Pension Kanuka program:ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం రసాభాసగా మారింది. కొండపి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇటీవల నియమితులైన మంత్రి సురేష్ రూ.3వేల రూపాయల పింఛన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తుండగానే, వైఎస్సార్సీపీకి చెందిన రెండు వర్గాల నాయకులు బల ప్రదర్శనకు దిగారు. వరికూటి అశోక్‌బాబు, డాక్టర్ వెంకయ్య వర్గీయులు వేదికపై పరస్పరం బాహాబాహీకి దిగారు. ఈ గలాటాను చూసి పెన్షనర్లు భయభ్రాంతులకు గురయ్యారు.
ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు మంత్రి సురేష్ యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇన్ఛార్జిగా వచ్చి వర్గాలను సృష్టిస్తున్నారా అంటూ మంత్రి సురేష్‌పై కేకలు వేసుకొని అశోక్ రెడ్డి వర్గీయులు కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. కొండపి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్న ఆదిమూలపు సురేష్‌కు నియోజకవర్గంలో అడుగు పెట్టగానే వర్గపోరు తలనొప్పిగా మారింది. పైగా సమావేశాల్లో జనం ముందే బాహాబాహీకి దిగడంతో పరువు పోయే పరిస్థితి ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు. ఈ సందర్భంగా సమావేశాల్లో మాట్లాడిన మంత్రి సురేష్ జగన్ మొహం చూసి ఓటేయాలని కోరారు.