ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tense Situation in Mantralayam

ETV Bharat / videos

Tension in Mantralayam: మంత్రాలయంలో ఉద్రిక్తత.. టీడీపీ - వైసీపీ పోటాపోటీ నిరసనలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 4:34 PM IST

Tension in Mantralayam: టీడీపీ శ్రేణులు చేస్తున్న నిరసన దీక్షలపై వైసీపీ నేతలు, నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఘటనతో  కర్నూలు జిల్లా మంత్రాలయం(Mantralayam)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్​కు నిరసనగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. టీడీపీ (TDP) దీక్షలకు పోటీగా... వైసీపీ (YCP) ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో  బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. 

ఇరువర్గాల ర్యాలీల కారణంగా...  గొడవలు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు... దీక్షా శిబిరానికి అడ్డంగా లారీలు పెట్టారు. దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) బాల నాగిరెడ్డి బృందం... పెద్ద ఎత్తున బాణసంచాను కాల్చారు. టీడీపీ  దీక్షాశిబిరం ముందు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో పోలీసులు టీడీపీ నేతలకు సర్ధిచెప్పడంతో  టీడీపీ శ్రేణులు సంయమనం పాటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. 

ABOUT THE AUTHOR

...view details