ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tense_Atmosphere_in_Palasa

ETV Bharat / videos

Tension at Palasa: పలాసలో ఉద్రిక్తత.. పోలీసుల బలవంతపు తరలింపుతో శివాజీకి అస్వస్థత - tdp leaders protest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 10:42 PM IST

Tension at Palasa of Srikakulam District:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ.. ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 'రిలే నిరాహార దీక్షల'ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నేత గౌతు శిరీష ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా.. శాంతియుతంగా దీక్ష చేస్తున్న గౌతు శివాజీని బలవంతంగా పోలీసులు సోంపేటలోని ఇంటికి తరలించారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహించారు. గౌతు శివాజీని ఫోన్‌లో పరామర్శించారు. అనంతరం పలాసలో జరుగుతున్న పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.

Gauthu Sirisha Comments: చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ.. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని శ్రీకాకుళం జిల్లా నందిగాంలో శుక్రవారం నాడు టీడీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ధర్నాలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుకు భద్రత లేదని..ఆయనకు ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గౌతు శిరీష మాట్లాడుతూ..''పలాస ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను గమనించాలి. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మాపై పశువుల శాఖ మంత్రి పోలీసుల చేత దాడులు చేయిస్తున్నారు. బలవంతంగా లాకెళ్లి, చిత్రహింసలకు గురి చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ మంత్రిని ఇంటికి సాగనంపాలని పలాస ప్రజలను కోరుతున్నాను'' అని ఆమె అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details