ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tension_at_nagarjunasagar

ETV Bharat / videos

ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం - నాగార్జునసాగర్ డ్యాంపై ఉద్రిక్తత - Nagarjunasagar police clash

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 5:04 PM IST

Tension at Nagarjunasagar Reservoir:తెలుగు రాష్ట్రాలు సాగు, తాగునీరు పంచుకునే నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి వందలాది మంది ఏపీ పోలీసులు, ఉన్నతాధికారులు డ్యాం వద్దకు చేరుకోవడంతో అక్కడ పోలీసుల హైడ్రామా కొనసాగింది.. తెలంగాణ ఎస్‌పీఎల్‌ ఆధ్వర్యంలో ఉన్న డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఏపీ భూభాగ పరిధిలో ఉన్న 13వ గేటు వద్దకు చేరుకుని.. బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేశారు. అక్కడ వరకు పూర్తిగా డ్యాంను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్ర పోలీసులు డ్యాం విద్యుత్తు సరఫరా నిలిపివేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తక్కవగా ఉండటం ఏపీ పోలీసులు సుమారు 400 మంది ఉండటంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 13 గేటు వరకు డ్యాంను స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మోటర్లకు విద్యుత్తు సరఫరాను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నీటి పారుదల శాఖ అధికారులు 2వేల క్యూసెక్కుల నీటిని తాగునీటి కోసం విడుదల చేయడంతో రాత్రి నుంచి నెలకొన్న హైడ్రామాకు తాత్కాలికంగా తెరపడింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం వద్ద వందలాది ఏపీ పోలీసులను మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details