Tension at Kakinada Collectorate: అడపా భీమరాజు హత్య కేసు కొట్టివేత.. పెట్రోలు పోసుకుని పలువురు ఆత్మహత్యాయత్నం - ap latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 10:36 PM IST
Tension at Kakinada Collectorate : కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురం మండలం విరవాడకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు అడపా భీమరాజు హత్య కేసును అదనపు జిల్లా జడ్జి కొట్టేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం (Attempted Suicide by Pouring Petrol at Collectorate) చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై భైఠాయించారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 2012లో ఇళ్ల పట్టాల పంపిణీ వివాదంలో పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, అడపా భీమరాజులపై ప్రత్యర్థులు దాడి చేయటంతో ఇద్దరు మృతి చెందారు. 12 ఏళ్లుగా కొనసాగిన కేసు కొట్టి వేయటంపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై చంపారని,.. ఇప్పటికి శిక్ష లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు కింద అయిన కనీస శిక్ష కూడా పడలేదని బాధిత కుటుంబ సభ్యులు అన్నారు.